తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ దాదాపు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్‌ను గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం పనులు పూర్తయ్యాయి.

CM KCR will be visiting Delhi for three days from today
తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్(KCR) బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ దాదాపు మూడు రోజుల పాటు ఢిల్లీ(Delhi)లోనే ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్‌ను గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం(BRS Central Office) పనులు పూర్తయ్యాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy), ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(Santhosh Kumar) ఢిల్లీ వసంత విహార్(Vasantha Vihar)లో నిర్మాణమైన సెంట్రల్ ఆఫీస్ ప్రారంభ పనులను పరిశీలిస్తున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పలువురు జాతీయ నేతలతోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో.. ఇకపై జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే నడువనున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న కేసీఆర్.. ఆ దిశగా కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వసంత్ విహార్‌లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయంను మధ్యాహ్నం ఒంటి గంట 5 నిమిషాలకు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
