పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందించారు

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందించారు. అలాగే కోచ్‌ నాగపురి రమేష్‌ కి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. కోటి రూపాయల నగదుతో పాటు ముందుగా ప్రకటించినట్టుగా గ్రూప్ -2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థల కేటాయింపుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తమకు అందించిన‌ ప్రోత్సాహంపై దీప్తి జీవాంజి, కోచ్ రమేష్ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు హాజరయ్యారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story