మూసీని(Moosi river) సుందరీకరిస్తామంటే బావాబామ్మర్దులు జనాల మీద పడ్డరు.

మూసీని(Moosi river) సుందరీకరిస్తామంటే బావాబామ్మర్దులు జనాల మీద పడ్డరు. మూసీ పరివాహక ప్రాంతం ఎఫ్‌టీఎల్‌(FL), బఫర్‌ జోన్లో(Buffer zone) ఉన్న ఇళ్లను కూల్చివేస్తాం. వారికి ఆర్థిక సాయం చేసి మరో చోట పీఎం ఆవాస్‌ యోజన(PM Awas Yojana) కింద ఇల్లు కట్టిస్తామన్నారు. రాజకీయాల కోసం ప్రాజెక్టులు చేపట్టలేదని చెప్పారు. ప్రాజెక్టులు ఆపితే సంచులు తీసుకొస్తారు, గతంలో అధికారంలో ఉన్నవారికి ఈ విషయాలు బాగా తెలుసన్నారు. మూసి వల్ల నల్గొండ(Nalgonda) జిల్లా విషాన్ని మింగుతోందన్నారు. రాజకీయంగా నష్టపోయిన హైదరాబాద్‌ భవిష్యత్‌ కోసం మూసీ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నల్గొండలో సీట్లు రానందున కేటీఆర్(KTR), హరీష్‌రావు(Harish rao) జిల్లాపై కోపం పెంచుకున్నారన్నారు. కేటీఆర్, హరీష్‌రావు ఏం మాట్లాడితే తర్వాతి రోజు ఈటల ఇదే మాట్లాడుతున్నారు. ఈటలకు దమ్ముంటే మోడీ దగ్గరికి వెళ్లి నిధులు తెచ్చుకుందామన్నారు. కేసీఆర్‌ చేసిన తప్పులను మేం సరిచేస్తున్నామన్నారు. కంటోన్మెంట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్ తీసుకొచ్చామన్నారు. ప్రతిపక్షాలు వాగుడు ఆపకుంటే వీపు చింతపండు చేస్తామన్నారు రేవంత్(revanth reddy).

Updated On
Eha Tv

Eha Tv

Next Story