మాజీ మంత్రి హరీష్‌రావుపై(Harish Rao) రేవంత్‌రెడ్డి(Revanth reddy) విరుచుకుపడ్డారు.

మాజీ మంత్రి హరీష్‌రావుపై(Harish Rao) రేవంత్‌రెడ్డి(Revanth reddy) విరుచుకుపడ్డారు. పేదలకు మంచి చేస్తే కొందరికి నచ్చడంలేదు.. చెప్పులు మోసే నేత.. నాకు సవాల్‌ చేస్తున్నాడన్నారు. చెప్పులు కొనుక్కోవాలన్నా.. నా దగ్గరకు వచ్చిన రోజులు మర్చిపోయినట్టున్నాడని హరీష్‌రావును విమర్శించారు. హైడ్రా(Hydra) వేరే.. మూసీ(Musi bueatification) పునరుజ్జీవం వేరే.. బుల్డోజర్లను సిద్ధం చేశా.. ఎవరు అడ్డం వస్తారో రండని.. బిల్లారంగాలు ఇద్దరూ అడ్డుపడుతారా చూద్దామని రేవంత్‌ అన్నారు. పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకుంటారా అని ప్రశ్నించారు. కేటీఆర్‌, హరీష్‌రావు ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. మీ ఫామ్‌హౌస్‌ల దగ్గరికి ఎప్పుడు రావాలో కేటీఆర్‌, హరీష్‌రావు చెప్పాలన్నారు. మీ ఫామ్‌హౌస్‌ల దగ్గర నిజనిర్ధారణ చేశాక.. మూసీ, మల్లన్నసాగర్‌కు ఎక్కడికైనా వెళ్దామన్నారు. ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story