జ్యోతిబాపూలే భవన్లో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న తొలి ప్రజాదర్బార్‌కు భారీ స్పందన కనిపించింది. ఉదయం 8 గంటలకే జనం పెద్ద ఎత్తున ప్రజాభవన్‌కు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. దశాబ్ధకాలం తర్వాత ప్రజాభవన్‌లో సామాన్యుల అడుగులు పడ్డాయి. ప్రజాభవన్ వేదికగా నేరుగా అర్జీలు స్వీకరించడమేకాదు..

CM Revanth Reddy Praja Darbar
జ్యోతిబాపూలే భవన్లో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న తొలి ప్రజాదర్బార్‌కు భారీ స్పందన కనిపించింది. ఉదయం 8 గంటలకే జనం పెద్ద ఎత్తున ప్రజాభవన్‌కు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. దశాబ్ధకాలం తర్వాత ప్రజాభవన్‌లో సామాన్యుల అడుగులు పడ్డాయి. ప్రజాభవన్ వేదికగా నేరుగా అర్జీలు స్వీకరించడమేకాదు..ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రగతి భవన్ కాస్త జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌గా మారింది. దశాబ్ద కాలం దర్వాత ప్రజాభవన్ గేట్లు తెరచుకున్నాయి. ప్రజా భవన్ వేదికగా ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించే ప్రక్రియకు స్వీకారం చుట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా స్వయంగా ప్రజాభవన్‌కు వచ్చి..తనను కలవచ్చని చెప్పారు. ప్రజాభవన్‌కు ఎవరైనా రావచ్చని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని అన్నారు. ప్రజాదర్బార్‌లో తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపడుతూనే..సీఎం రేవంత్‌రెడ్ది కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం, అదే వేదికపై నుంచే ప్రగతి భవన్ కంచె తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను అధికారులు తొలగించారు. ఒకవైపు రేవంత్ ప్రమాణం, మరోవైపు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు కంచె తొలగింపు ఒకేసారి జరిగిపోయాయి.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రోజు ఉదయం పూట ప్రజలను కలిసేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఇన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో.. మళ్లీ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మరి ఇవాళ ప్రజాదర్బార్ కార్యక్రమంలో సీఎం ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించనున్నారు. వారు అడిగే సమస్యలకు ఎలా సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
