కాంగ్రెస్‌ పార్టీ(Congress) అగ్రనేత రాహుల్‌గాంధీని(Rahul gandhi) ఆయన ఎంతగానో అవహేళన చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ(Congress) అగ్రనేత రాహుల్‌గాంధీని(Rahul gandhi) ఆయన ఎంతగానో అవహేళన చేశారు. అనేక సార్లు విమర్శించారు. పప్పు అని గేలి చేశారు. లీడర్‌గా పనికి రాడని తేల్చేశారు. అలాంటి వ్యక్తికి ఏరికోరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) కీలక హోదా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీపై, రాహుల్‌ గాంధీపై విషం కక్కిన వ్యక్తిని అందలం ఎక్కించారు. ఆయన ఎవరంటే దక్కన్‌ క్రానికల్‌(Deccan chronical) మాజీ రెసిడెంట్ ఎడిటర్‌. ఆయన ఎక్కడివారంటే శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వారు.. పేరు శ్రీరాం కర్రి(Sriram Karri). ఆయనను తెలంగాణ రాష్ట్ర మీడియా, కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌గా రేవంత్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీరాం కర్రి గతంలో చేసిన ట్వీట్లు అన్ని బయటకు వస్తున్నాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో రెండో స్థానానికి చేరడంపై వ్యంగ్యంగా రాసుకొచ్చిన శ్రీరాం కర్రి కాంగ్రెస్‌పై విమర్శనాత్మకమైన కామెంట్లు ఎన్నో చేశారు. సోనియాగాంధీపై కూడా సెటైర్లు వేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెట్టుబడుల కోసం దావోస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా సీఎం బృందంలో శ్రీరాం కర్రి కూడా ఉన్నారు. ఆయన ఏ హోదాలో అక్కడి వెళ్లారనే చర్చ అప్పుడు కూడా జరిగింది. కేవలం రేవంత్‌ వ్యవహారాలు, మీడియా మేనేజ్‌మెంట్‌ చేయడానికే రేవంత్‌ తనతో తీసుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story