సోషల్‌ మీడియా గురించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సోషల్‌ మీడియా గురించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party), తన గెలుపులో సోషల్‌ మీడియా పాత్రలేదని చెప్పేశారు. తన గెలుపులో సోషల్‌ మీడియా పాత్ర ఏమాత్రం లేదన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే సగర్వంగా గెలిచి వచ్చామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఓడిపోయిన పార్టీ నేత ఒకాయన.. సోషల్ మీడియాన అడ్డుపెట్టుకొని అడ్డమైన చెత్త అంతా రాస్తూ తమపై బురద జల్లుతున్నారన్నారు. సోషల్ మీడియాతో అధికారంలో వస్తామని అనుకుంటున్నాడని అది ఎప్పటికీ జరగదన్నారు. సోషల్‌ మీడియాతో అధికారంలో వచ్చేది కలనే అంటూ.. అతనికి చంచల్‌గూడ జైలు(Chenchalaguda jail)లో చిప్పకూడు తినిపిస్తానన్నారు. అయితే గత ఎన్నికలకు ముందు సోషల్ మీడియా టీఎంను ఏర్పాటు చేసుకొని కేసీఆర్(KTR), బీఆర్‌ఎస్‌(BRS) లక్ష్యంగా విమర్శలు కుప్పించిన సోషల్ మీడియా.. ఇప్పుడు దాని పాత్రలేదని రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అనడంలో ఆంతర్యమేంటో అని చర్చించుకుంటున్నారు. చచ్చిపోయిన కాంగ్రెస్‌ను లేపింది తానేనని పలుసార్లు తీన్మార్ మల్లన్న(TeenMar Mallana) చెప్పుకున్నారు. ఇలాంటి ప్రచారాన్ని కట్టడిచేయడంలో భాగంగానే రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషించుకుంటున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story