తెలంగాణలో(Telangana) గత కొన్ని రోజులుగా చలి(Cold) తీవ్రత బాగా పెరిగింది..

తెలంగాణలో(Telangana) గత కొన్ని రోజులుగా చలి(Cold) తీవ్రత బాగా పెరిగింది.. చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రం లోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా(Sanga reddy) కోహిర్ లో కనిష్టంగా పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అసీఫాబాద్(Asifabad) జిల్లా సిర్పూర్ లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో సైతం కోల్డ్ వేవ్(Cold wave) కొనసాగుతున్నది. గ్రేటర్ ప్రజలు చలి పులి పంజా దెబ్బకు గజగజ లాడుతున్నారు. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి..

Updated On
Eha Tv

Eha Tv

Next Story