తెలంగాణలో(Telangana) మళ్లీ గాడిద గుడ్డు పోస్టర్లు(donkey egg posters) వెలిశాయి.

తెలంగాణలో(Telangana) మళ్లీ గాడిద గుడ్డు పోస్టర్లు(donkey egg posters) వెలిశాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలాంటి పోస్టర్లు కనిపించాయి. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ(Narendra modi) ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని కాంగ్రెస్‌(congress) ప్రచారం చేసింది. మంగళవారం సమర్పించిన బడ్జెట్‌లో కూడా తెలంగాణకు మోదీ ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఫైరయ్యింది. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది లోక్‌సభ స్థానాలను కట్టబెడితే మోదీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందని పోస్టర్లు వెలిశాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు బస్టాండ్లలో ఈ హోర్డింగులు దర్శనమిస్తున్నాయి,

Updated On
Eha Tv

Eha Tv

Next Story