అధికారంలో ఉన్నా, లేకున్నా, నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజా సమస్యలను తీరుస్తూ వార్తల్లో ఉండే వ్యక్తి జగ్గారెడ్డి(Jaga Reddy).

అధికారంలో ఉన్నా, లేకున్నా, నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజా సమస్యలను తీరుస్తూ వార్తల్లో ఉండే వ్యక్తి జగ్గారెడ్డి(Jaga Reddy). తెలంగాణ రాజకీయాలలో(Telangana Politics) ఆయనది ప్రత్యేకమైన శైలి. ఆయన ఏమి మాట్లాడినా వివాదాస్పందగానే అనిపిస్తుంది. కానీ అది ఆయన మాట తీరు అంతే! రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ(Congress) అధికారంలో వచ్చింది కానీ ఆయన దురదృష్టం ఎమ్మెల్యేగా గెలవలేదు. గెలిచి ఉంటే ప్రభుత్వంలో కీలకభూమిని పోషించేవారు. తాను ఓడిపోయాను కాబట్టే ప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో(Sanga reddy) ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించిన జగ్గారెడ్డి రామమందిరం నుంచి దుర్గమ్మ గుడి వరకు భారీ ఊరేగింపును తీశారు. తర్వాత మీడియాతో ముచ్చటించారు. తాను ప్రస్తుతం ఎమ్మెల్యేని కాదు.. కానీ సోనియా(sonia Gandhi), రాహుల్‌(Rahul gandhi) ఆశీర్వాదంతో..వచ్చే పదేళ్లలో ముఖ్యమంత్రిని అవుతానని, పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని జగ్గారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story