సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇటీవల కాన్సర్ బారిన పడింది అది తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శించిన జగ్గారెడ్డి

సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇటీవల కాన్సర్ బారిన పడింది అది తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శించిన జగ్గారెడ్డి.చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 7లక్షల అప్పులు చేశానన్న బాధితురాలు తెలిపారు.భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించిన ఆమని.ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని చెప్పిన ఆమని.ఇది తెలుసుకున్న జగ్గారెడ్డి(Jagga Reddy) తక్షణమే బాధితురాలికి రూ. 10లక్షల నగదు సాయం అందించారు.

సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు.తనకు సాయం చేసి, వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు.కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టి కి తీసుకు వచ్చా నన్నారు.పేదలకు ఇలాంటి రోగాలు వస్తే.. కనీసం చికిత్స చేయించుకోవడానికి.. పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు(Cancer patient) అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని జగ్గారెడ్డి కోరారు.క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు ,ట్రీట్ మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)దృష్టికి తీసుకెళతా అని ఆయన అన్నారు. అనంతరం బాధిత మహిళా, పిల్లలతో మాట్లాడిన జగ్గారెడ్డి బాధితురాలికి ధైర్యం చెప్పారు.

Updated On
ehatv

ehatv

Next Story