అగ్రరాజ్యం అమెరికాలో(america) భారీ వీసా స్కామ్‌(Visa scam) వెలుగులోకి వచ్చింది.

అగ్రరాజ్యం అమెరికాలో(america) భారీ వీసా స్కామ్‌(Visa scam) వెలుగులోకి వచ్చింది. H-1B వీసా రిగ్గింగ్‌(H1B Visa Rigging) జరిగిందని చెబుతున్నారు. ఇందులో ఆదిలాబాద్‌(Adilabad) అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్(congress) అభ్యర్థి ప్రమేయం ఉందన్న వార్త సోషల్‌ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం లేదని కంది శ్రీనివాస్‌రెడ్డి(Kandhi srinivas reddy) క్లారిటీ ఇచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ వివరణ ఇచ్చుకున్నారు. 'అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకుని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి కొనసాగుతున్న నా వ్యాపారాలను దెబ్బ తీయడానికి నా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలు ఫలించవు. నన్ను రాజకీయంగా ఎదుర్కొలేక నా మీద, నా కంపెనీల మీద కొందరు పనిగట్టుకుని, వాస్తవాలను వక్రీకరిస్తూ దుష్ర్పచారం చేస్తున్నారు. తప్పుడ ప్రచారం చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. లీగల్‌ నోటీసులు ఇస్తాం. సోషల్‌ మీడియాలో దుష్ర్పచారం చేసేవారిపై సైబర్‌ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేస్తాం. ఒక సామాన్య మధ్య తరగతి రైతు బిడ్డనైన నా ఉన్నతమైన ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకునేవారికి తీవ్ర నిరాశ తప్పదు' అని ప్రకటించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story