కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతాం. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు పెన్షన్లు పెంచుతామని అప్పటివరకూ పెంచే అవకాశం లేదన్నారు. రుణమాఫీ, ఫ్రీ బస్సుతో రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీల అమలు మొదలు పెడతామని ఇప్పుడు నాలుక మడత వేశారన్నారు. గతంలో కూడా అసెంబ్లీలో ఓ సారి ఈ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 'ఆస్పత్రుల్లో, ఇళ్లలో ఓ అరగంట కరెంట్ లేకపోతే కొంపలు ఏమన్నా మునుగుతాయా అధ్యక్ష' అన్న మాటలపై విమర్శలు లేవనెత్తాయి.

Updated On
ehatv

ehatv

Next Story