జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రచారానికి మంత్రి పొన్నంను కాంగ్రెస్‌ దూరం పెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రచారానికి మంత్రి పొన్నంను కాంగ్రెస్‌ దూరం పెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీకి నెగటివ్ ఇమేజ్ వస్తోందని హైకమాండ్ ఆదేశాలతో ఆయనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. అడ్లూరి లక్ష్మణ్‌ను “దున్నపోతు” అని తిట్టడంతో పార్టీ లోపలే పెద్ద కలకలం రేగింది. మరోవైపు భర్తను కోల్పోయిన బాధలో మాగంటి గోపీనాథ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను “డ్రామా” అంటూ అవమానించడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ గ్రహించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో మహిళా ఓటర్లలో ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉందని పార్టీ అంతర్గత సర్వేలు చెబుతున్నాయి. పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ నేతలు ప్రచారానికి కొద్దిరోజులు దూరంగా ఉండండి అని పొన్నం ప్రభాకర్‌కి సూచించినట్లు సమాచారం

Updated On
ehatv

ehatv

Next Story