హైదరాబాద్‌ నగరంలోని ఆరంగర్ ఫ్లైఓవర్‌పై ఓ ప్రేమ జంట విచ్చలవిడిగా ప్రవర్తించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌ నగరంలోని ఆరంగర్ ఫ్లైఓవర్‌పై ఓ ప్రేమ జంట విచ్చలవిడిగా ప్రవర్తించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ జంట రన్నింగ్ బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ, అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన ఇతర వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఓ యువకుడు బైక్ నడుపుతుండగా, అతని ప్రియురాలు ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చొని హగ్ చేసుకుని ప్రయాణించింది. ఈ దృశ్యాలను రహదారిపై ప్రయాణిస్తున్న మరో వాహనదారుడు తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ జంట రిల్స్ తీసుకునేందుకు ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story