మొంథా వాయుగుండం నుంచి అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

మొంథా వాయుగుండం నుంచి అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కొనసాగుతోంది. ఇది తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌కు ఉత్తరంవైపు కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు అరేబియా సముద్రంలోని అల్పపీడనం ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. మరో వైపు మొంథా తుఫాను ధాటికి 1.23 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 1.38 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో లెక్కించనున్నట్లు . మరోవైపు రాష్ట్రంలో 4,576 కి.మీ. మేర రోడ్లు, 302చోట్ల కల్వర్టులు, వంతెనలు ధ్వంసమైనట్లు నిర్ధారించారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Updated On
ehatv

ehatv

Next Story