వ మాసాలు మోసి, కని పెంచిన కూతురు బాగుండాలని కోరుకుంది ఆ వృద్దురాలు. వృద్దాప్యంలో బిడ్డ తనకు ఆసరాగా ఉంటుంది అనుకుంది.

నవ మాసాలు మోసి, కని పెంచిన కూతురు బాగుండాలని కోరుకుంది ఆ వృద్దురాలు. వృద్దాప్యంలో బిడ్డ తనకు ఆసరాగా ఉంటుంది అనుకుంది. కానీ.. కూతురు మాత్రం తల్లి ప్రేమ, వాత్యల్యం కంటే డబ్బే ముఖ్యమని భావించి కర్కషంగా ప్రవర్తించింది. తల్లి వద్ద ఉన్న బంగారాన్ని లాక్కుని.. ఆమెను దట్టమైన అడవిలో తల్లిని వదిలేసింది. తాను ఎక్కడ ఉన్నానో తెలియక ఆ వృద్ధురాలు రెండు రోజులుగా తిండితిప్పలు లేక అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ ఘటన జగిత్యాల(jagtial) జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా వీధిలో నివసించే వృద్ధురాలు బుధవ్వను కూతురు ఈశ్వరి నగలు, డబ్బులు లాక్కుని గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి అడవిలో వదిలేసింది. రెండు రోజులుగా ఆకలి, దాహంతో అలమటించిన బుధవ్వను శ్రీరాములపల్లి యువకులు రక్షించి, సంక్షేమ అధికారులకు సమాచారం అందించారు. ఆమెను సఖి సెంటర్‌కు తరలించారు.

Updated On
ehatv

ehatv

Next Story