ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌(Mobile phone) కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడింది.

ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌(Mobile phone) కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడింది. సెల్‌ ఫోన్‌ కొనియ్యలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు(Suicide) పాల్పడింది. చేతికొచ్చిన కూతురు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిండ్రులు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు విలేకరులకు వెల్లడించారు. మెదక్(Medak) జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌లో రుచిత అనే 18 ఏళ్ల యువతి మెదక్‌లో డిగ్రీ చదువుతోంది. రోజు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉందని మెదక్‌లోనే హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందున సెల్‌ఫోన్‌ కొనియ్యాలని తల్లిదండ్రులను కోరింది. డబ్బుకు కొంత ఇబ్బందిగా ఉంది, కొన్ని రోజుల తర్వాత కొనిస్తామని రుచితకు తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా రుచిత వినలేదు, మనస్తాపంతో సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కూతురు ఆత్మహత్యతో విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story