8 మంది విద్యార్థులకు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఓ ర్యాపిడో డ్రైవర్‌తో పాటు మరో యువకుడు అరెస్ట్.

8 మంది విద్యార్థులకు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఓ ర్యాపిడో డ్రైవర్‌తో పాటు మరో యువకుడు అరెస్ట్. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ICFAI డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు. కొంపల్లిలో ఉంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులను పరిచయం చేసుకున్న ఒడిశాకు చెందిన బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి వర్షిత్. ఒడిశా నుంచి ఎండు గంజాయి తీసుకొచ్చి రూ.వెయ్యికి పది గ్రాముల చొప్పున.. ర్యాపిడో డ్రైవర్ అంబూరీ వంశీ (19)తో గంజాయి సరఫరా చేస్తున్న వర్షిత్.
యూనివర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థులు అభినవ్ సింగ్ (20), సయ్యద్ మొయినొద్దీన్ ఖాద్రి (19), పీయూష్ సింగ్ (20), ఎల్ఎల్బీ విద్యార్థులు సౌరజ్ నస్కర్ (22), గౌరవ్ దాగా (21), నిమ్మ సుమిత్ రెడ్డి (22), సాస్వత్ చతుర్వేది (21), ఎంబీఏ సెకండ్ ఇయర్ విద్యార్థి అనురాగ్ గిరీష్ (27)తో పాటు ఓ ప్రైవేటు హాస్టల్లో పని చేస్తున్న ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రవి గైక్వాడ్ (19) కాలేజీ సమీపంలో గంజాయి తీసుకుంటుండగా గుర్తుంచిన పోలీసులు
