కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలది అంటున్న పోలీసులు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) చిక్కుల్లో పడ్డారు. జన్వాడ రిజర్వ్‌ కాలనీలో(Janwad rese) ఉన్న ఆయన బావమరిది రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌లో(Farm house) డ్రగ్స్‌ పార్టీ(Drugs party) జరుగుతున్నదని పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పార్టీలో ఉన్నవారికి డ్రగ్స్‌ టెస్ట్ చేశారు. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. కొకయున్(Cocoine) తీసుకున్నట్టు గా డ్రగ్ పరీక్షలో తేలింది. దాంతో Ndps యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డీజీ సౌండ్లతో అదిరిపోతుండటంతో పార్టీ విషయం బయటకు వచ్చింది. డయల్‌ 100కు ఫోన్‌ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. భారీగా ఫారిన్‌ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు పోలీసులు. Section 34, Excise Act కింద మరో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story