హైదరాబాద్‌లో సీనియర్‌ జర్నలిస్ట్ రేవతి అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్ ఆఫ్‌ ఇండియా ఖండించింది.

హైదరాబాద్‌లో సీనియర్‌ జర్నలిస్ట్ రేవతి అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్ ఆఫ్‌ ఇండియా ఖండించింది. జర్నలిస్ట్ రేవతి పొగదండడ అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఆమె హక్కులు, వ్యక్తిగత భద్రతను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. సమయం కాని సమయంలో రేవతిని, ఆమె భర్తను అరెస్ట్ చేయడాన్ని ఖండించింది. EGI అధ్యక్షుడు అనంత్ నాగ్ ప్రధాన కార్యదర్శి రూబెన్ బెనర్జీ, కోశాధికారి కె. వీ. ప్రసాద్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. జర్నలిస్టులకు వారి నివేదికలలో నిష్పాక్షికత, బాధ్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసింది, వార్తలను ఖచ్చితంగా దురుద్దేశం లేకుండా ప్రసారం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Updated On
ehatv

ehatv

Next Story