తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయంతో తెలంగాణలోని పాఠశాలల వేళలు మారాయి. పాఠశాల పని వేళల సర్దుబాటుకు సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయంతో తెలంగాణలోని పాఠశాలల వేళలు మారాయి. పాఠశాల పని వేళల సర్దుబాటుకు సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు పనిచేస్తాయి. గతంలో ఈ పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు నడిచేవి.

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు మినహా తెలంగాణ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సమయాల్లో మార్పులు వర్తిస్తాయి. జంట నగరాల్లో పాఠశాలలు ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story