మరోసారి ఉద్యమ నాయకుడైన ఈటలకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

మరోసారి ఉద్యమ నాయకుడైన ఈటలకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నిన్నటి దాకా ఈటలకే అధ్యక్ష పదవి అని ప్రచారం జరిగినా రాంచందర్ రావును తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ. బీజేపీలో తెలంగాణ ఉద్యమకారులకు చోటు లేదని మరోసారి రుజువు అయ్యిందని ఆయన అభిమానులు మండిపడతున్నారు. రేపు మాపు అని కాలం దాటేస్తు ఈటల రాజేందర్ గారి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పావులు కదిపారని ఆయన వర్గీయులు బీజేపీ(BJP) అధిష్టానంపై మండి పడుతున్నారు. తెలంగాణ(Telangana) బీజేపీ అధ్యక్షుడి ఎన్నికల్లో చంద్రబాబు కీలకంగా వ్యవహరించాడని సమాచారం. బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు(Chandrababu) మాట వినాల్సిన అవసరం ఏర్పడడంతో రాంచందర్‌రావు పేరును తెరపైకి తెచ్చారని విశ్వసనీయ సమాచారం. దీంతో ఉద్యమనేత అయిన ఈటలను బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆయన అభిమానులు, బీఆర్‌ఎస్‌లోని కొందరు నెటిజన్లు ఆయనను ఆహ్వానిస్తూ పోస్టులు పెడుతున్నారు.
