పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ అన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ది చెబుతారని కేసీఆర్‌(KCR) అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో కూడా ఉప ఎన్నిక వస్తుంది. కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని కేసీఆర్ అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్‎పూర్(Station Ghanpur) మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda rajaiah) ఎర్రవల్లి ఫామ్ హౌస్‎లో కేసీఆర్‎ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ ఆరా తీశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‎లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ది చెబుతారని అన్నారు. స్టేషన్ ఘనపూర్‎లోను ఉప ఎన్నిక(By Elections) వస్తుందని.. కడియం శ్రీహరి ఓడిపోయి మళ్లీ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని కేసీఆర్ ధీమా వ్యాక్తం చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story