మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రామచంద్రా రెడ్డి గురువారం సాయంత్రం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరణించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామచంద్రారెడ్డి.. రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పని చేశారు.

Ex Minister Adilabad Congress Leader C Ramachandra Reddy Passes Away
మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి(C Ramachandra Reddy) కన్నుమూశారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రామచంద్రా రెడ్డి గురువారం సాయంత్రం బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) రావడంతో మరణించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామచంద్రారెడ్డి.. రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పని చేశారు. రామచంద్రా రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడ్డి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు(Congress Senior Leader) రామచంద్రా రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీ(Congress)కి తీరని లోటు అని రేవంత్ రెడ్డి అన్నారు. రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజా సేవకు అంకితమయ్యారని .. నిజాయితీ, క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి రామచంద్రా రెడ్డి అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.


