గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మనంలో భాగంగా చర్చ జరుగుతున్న సందర్భంగా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వెరైటీ కథ చెప్పారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మనంలో భాగంగా చర్చ జరుగుతున్న సందర్భంగా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వెరైటీ కథ చెప్పారు. గవర్నర్‌ చదివిన ప్రసంగం చూస్తే ఎలా ఉందని తనకు తెలిసిన వ్యక్తిని అడిగితే అతను ఒక స్టోరీ చెప్పాడని జగదీష్‌రెడ్డి( Jagadish Reddy) అన్నారు. ఏంటా కథ అని అడిగితే ఓ ఊర్లో ఏతుల ఎంకటయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ గ్రామ సర్పంచ్‌ దగ్గిరికి ఓ రోజు ఏతుల ఎంకటయ్య భార్య వచ్చింది. మా ఎంకటయ్య నన్ను కొట్టిండు అని సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది. అప్పుడు ఆ పెద్ద మనిషి ఎంకటయ్యను పిలింపించి ఎందుకు కొట్టినవ్.. ఏంటి సంగతి అని అడిగితే.. మా అమ్మగారి ఇంటికి పాలు పోయొద్దన్నడు.. నేను పోస్తా.. పోసి తీరుతా అని తాను అంటే కొట్టిండు అని భార్య చెప్పింది. వెంటనే ఆ పెద్ద మనిషి నీకు పాలిచ్చే బర్లే లేవు కదా.. మరి పాలు ఎట్లా పోస్తవు అని అడిగితే ఆ ఎంకటయ్య చెప్పిన సమాధానం విని ఆ పెద్ద మనిషి ఆశ్చర్యపోయాడు. నాకు నాలుగు బర్లు ఉన్నయని చెప్పిండు.. నీకు ఒక్కటి కూడా లేదు కదా.. ఊరంతా చూసినం కదా అని ఆ పెద్ద మనిషి ప్రశ్నిస్తే.. అవును నాకు నాలుగు బర్లు ఉన్నాయని చెప్పిండంట ఎంకటయ్య.. ఎక్కడివి అంటే తప్పిపోయిన బర్రె దొరికితే ఒకటి, సచ్చిన బర్రె బతికితే రెండు, అత్తగారు పెడితే మూడు, తానొకటి కొనుక్కుంటే మొత్తం నాలుగు బర్లు అయితాయన్నాడంట ఏతుల ఎంకటయ్య. అట్లనే ఉంది బడ్జెట్‌ అని జగదీష్‌రెడ్డి వ్యంగ్యస్త్రాలు విసిరారు. రైతు రుణమాఫీ చేసినరా, రైతుబంధు ఇచ్చినరా, 12 వేలు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చినరా, తులం బంగారం ఇచ్చినరా, స్కూటీలు ఇచ్చినరా అని గవర్నర్‌ ప్రసంగంలో చేర్చిన అంశాలను ఎద్దేవా చేశారు జగదీష్‌రెడ్డి..




ehatv

ehatv

Next Story