హైదరాబాద్‌ నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు(Viskey Ice Cream) కలకలం రేపుతున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు(Viskey Ice Cream) కలకలం రేపుతున్నాయి. వన్‌ అండ్‌ ఫైవ్‌ పార్లర్‌లో ఎక్సైజ్‌ పోలీసులు సోదాలు నిర్వహించగా, విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి పిల్లలకు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తప్పుడు పనికి కారకులైన వన్‌అండ్‌ ఫైవ్‌(1&5) నిర్వాహకులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మిల్లిలీటర్ల విస్కీని కలుపుతున్నారు. ఐస్క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. 11.5 కిలోల విస్కీ ఐస్ క్రీమ్స్‌ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 1, రోడ్‌నంబర్‌ 5లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story