గ్రూప్-1 అభ్యర్థుల(Group-1 candidates) చలో సెక్రటేరియెట్‌(Secretariat) ఉద్రిక్తంగా మారింది.

గ్రూప్-1 అభ్యర్థుల(Group-1 candidates) చలో సెక్రటేరియెట్‌(Secretariat) ఉద్రిక్తంగా మారింది. జీవో 29ని(GO-29) రద్దు చేసి గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది విద్యార్థులు సచివాలయం గేటు వద్దకు చేరుకున్నారు. గత వారం రోజులుగా గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అశోక్‌నగర్‌లో కూడా ఆందోళనలు చేయడంతో పోలీసులు లాఠీచార్జీ(lati charge) కూడా చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థులకు బీఆర్‌ఎస్(BRS), బీజేపీ(BJP) అండగా నిలిచాయి. గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని బీఆర్‌ఎస్‌ లీగల్‌గా ఫైట్‌ చేస్తోంది. సుప్రీంకోర్టులో(Supreme court) కూడా బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ వేసింది. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌(bandi sanjay) నిలిచారు. గ్రూప్-1 అభ్యర్థుల సెక్రటేరియెట్ ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మంది కార్యకర్తలు, అభ్యర్థులు ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ నేతలు ఆర్‌.ఎస్.ప్రవీణ్‌కుమార్(RS Praveen), శ్రీనివాస్‌గౌడ్‌(Srinivas Goud), దాసోజ్‌ శ్రవణ్‌(Dasoj Sravan) పాల్గొన్నారు. సచివాలయం ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో కేంద్రమంత్రి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఆర్‌ఎస్పీ, శ్రీనివాస్‌గౌడ్, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story