BRS: ఫేక్‌ అకౌంట్స్‌తో తప్పుడు ప్రచారం: BRS

ముఖ్యమంత్రి కార్యాలయం ఫేక్‌ న్యూస్ నెట్‌వర్క్‌ను నడుపుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపించింది. బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నా డని బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటినుండో ఉన్న అనుమానం ఇప్పు డు నిజమైందని బీఆర్‌ఎస్ పార్టీ చెప్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వి నియోగం చేస్తూ, బీఆర్ఎస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విస్తృతమైన ఫేక్ వార్తల ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నా డని ఆరోపించింది. బీఆర్ఎస్ నాయకులపై తప్పు డు సమాచారం వ్యాప్తి చేస్తూ.. అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న

ఫేస్బుక్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, ట్వి ట్టర్ హ్యాండిల్స్‌ వెబ్‌సైట్లు నడిపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ చెప్తోంది.

“తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స గ్రూప్” పెట్టుకొని, ఆ గ్రూప్‌లో సీఎం పీఆర్వో అన్వే ష్ రెడ్డి, మీడియాఅండ్ కమ్యూనికేషన్స డైరెక్టర్

శ్రీరామ్ కర్రి, సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మన్నె కలిసి ఈ కుట్రల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నా రని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తూ, రేవంత్ రెడ్డికి స్వయంగా రిపోర్ట్‌ చేసే కొందరు అధికారులు ఈ అసభ్యకరమైన కంటెంట్ తయారుచేయడంలో, ప్రచారం చేయడంలో పాలుపంచుకుంటున్నా రని. బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటానికి ఫేక్

సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నా రని. వాళ్లు వ్యాప్తి చేస్తున్న కంటెంట్లో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటూ.. అనేక మంది సంబంధం లేని మహిళల వ్యక్తిగత జీవితాలను అందులోకి లాగుతున్నారని విమర్శించారు బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిషాంక్.

గత కొన్ని నెలలుగా ఈ బృందం కొంతమంది సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారనే నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంలో కూడా కీలక పాత్రపోషించింది. ఇటువంటి అసభ్యకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేయడంలో సీఎంవో కూడా పాలుపంచుకోవడం తీవ్రకలకలం రేపుతోంది.

కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తోందంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు.

Updated On
ehatv

ehatv

Next Story