నాగర్‌కర్నూల్(Nagar kurnool) జిల్లా వనపట్ల(Vanapatla) గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

నాగర్‌కర్నూల్(Nagar kurnool) జిల్లా వనపట్ల(Vanapatla) గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైక‌ప్పు కూలడంతో ఒకే కుటుంబంలోని నలుగురు సజీవ సమాధి అయ్యారు. ఇంటి య‌జ‌మాని గుడుగ భాస్కర్ (36), అత‌ని భార్య పద్మ (26), ఇద్దరు కుమార్తెలు తేజస్విని, వసంతల‌తో పాటు 10 నెలల కుమారుడు రుత్విక్‌లు నిద్రిస్తున్న సమయంలో ఆదివారం రాత్రి ఇంటి పైకప్పు కూలిపోయింది(Roof Collapse). వర్షాల కారణంగా ఇంటి నిర్మాణం బలహీనపడి పైక‌ప్పు కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. కుటుంబాన్ని కాపాడేందుకు ఇరుగుపొరుగు వారు శిథిలాలను తొలగించినా.. అప్పటికే నలుగురు మృతి చెందిన‌ట్లు వారు పేర్కొన్నారు. భాస్కర్‌కు గాయాలు కాగా.. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story