గత కొంత కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి(revanth reddy) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది

గత కొంత కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి(revanth reddy) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఫార్మా సిటీ(Pharma City) ఏర్పాటుకు పలు గ్రామాల్లోని రైతుల భూములు(Lands) సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ భూములు సేకరించేందుకు అధికారుల ప్రయత్నించడాన్ని రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్(Kondagal) నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు రైతులు ఎదురుతిరిగారు. రేవంత్ రెడ్డి మా భూములు తీసుకుంటే ఇక్కడే చనిపోతామని బెదిరిస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మాకు ఎదురు తిరిగిన రైతులు.. ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదన్నారు. దుద్యాల ఎంఆర్ఓ ఆఫీసు ముందు పోలేపల్లికి చెందిన మహిళా రైతు తూర్పు రాజమ్మ పురుగుల మందు డబ్బాతో చావనైనా చస్తా.. కానీ భూమి మాత్రం ఇచ్చేది లేదని నిరసన తెలిపింది. అప్రమత్తమైన తోటి రైతులు ఆమె చేతిలోని పురుగుల మందు డబ్బాను గుంజుకున్నారు.. చావనైనా చస్తాం కానీ భూమి ఇచ్చేది లేదని ఆందోళన చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story