ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..!

మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారజామాను మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ట్యాంకర్‌, డీసీఎం ఢీకొని స్పాట్‌లోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated On
ehatv

ehatv

Next Story