నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కుర్వ కుర్మయ్య ముగ్గురు కుమార్తెలు మక్తల్ లోని ప్రభుత్వ హాస్టల్లో చదువుతుండగా

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కుర్వ కుర్మయ్య ముగ్గురు కుమార్తెలు మక్తల్ లోని ప్రభుత్వ హాస్టల్లో చదువుతుండగా, కుక్క కరవడంతో ఇంటికి వచ్చి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న చిన్న కూతురు(10). ఈ నెల 25వ తేదీన తల్లి కూలీ పనులకు వెళ్లగా, మేకల వద్దకు తండ్రి వెళ్లాడు. చిన్న కూతురు పాఠశాల నుండి వచ్చి చదువుతుండగా, మద్యం మత్తులో ఇంటికి వచ్చి కూతురిపై అత్యాచారానికి తండ్రి పాల్పడ్డాడు. నీ కాళ్లు మొక్కుతా నాన్న.. నన్ను ఏమీ చేయొద్దు అని ఎంత వేడుకున్నా కనికరించకుండా అఘాయిత్యానికి పాల్పడడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. బాలిక కేకలు విని తీవ్ర రక్తస్రావంలో ఉన్న ఆమెను స్థానికులు కాపాడారు. కూలీ పనుల అనంతరం ఇంటికి తిరిగివచ్చి కూతురి పరిస్థితి చూసి, చికిత్స నిమిత్తం గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తల్లి తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో మరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించాలని చెప్పిన వైద్యులు. శనివారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసు కంప్లైంట్ ఇస్తేనే వైద్యం చేస్తామని అక్కడి వైద్యులు తెలపడంతో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
