హైదరాబాద్‌లో ఆదివారం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్‌(Hyderabad)లో ఆదివారం భారీ వర్షం(Heavy Rain) కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక్కసారిగా పెద్ద వర్షం పడింది. వారాంతాన్ని ఎంజాయ్‌ చేయలేకపోయారు చాలా మంది. మరోవైపు కల్కి సినిమా చూసేందుకు పంజాగుట్ట సెంట్రల్‌ మాల్‌లో ఉన్నపీవీఆర్‌కు వెళ్లిన ప్రేక్షకులపై వాన చినుకులు పడ్డాయి. పీవీఆర్‌ సీలింగ్‌పై నుంచి వర్షం పడటంతో ప్రేక్షకులు షాక్‌ అయ్యారు. సినిమా థియేటర్లో వాన పడటమేమిటని ఆందోళన చెందారు. థియేటర్‌ యజమానులతో వాగ్వాదానికి దిగారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story