14 ఏళ్ల బాలుడి ప్రాణాలు పొట్టన పెట్టుకున్న 84 ఏళ్ల మాజీ ఐఏఎస్

హైదరాబాద్(Hyderabad) నేరేడ్‌మెట్‌లోని రామకృష్ణాపురం(Ramakrishna puram) వంతెనకు దగ్గరలో ఓ బాలుడిని కారు వేగంగా వచ్చి(Car accident) ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడిని ఎం.శ్రీకాంత్‌గా గుర్తించారు. స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి(Former IAS Officer) వేగంగా కారునడుపుతూ బాలుడిని ఢీకొట్టాడు. ఐదేళ్ల క్రితమే శ్రీకాంత్‌ తండ్రి కూడా చెట్టుపై నుంచి పడిపోవడం, ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాలు చూస్తే.. రామకృష్ణాపురం ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో శ్రీకాంత్ రోడ్డు వేచి ఉన్నాడు. అదే రోడ్డుపై వేగంగా కారు నడుపుతూ మాజీ ఐఏఎస్‌ డి.విజయ్ కుమార్ (84), రోడ్డు పక్కన నిల్చున్న శ్రీకాంత్ ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అయితే శ్రీకాంత్ తండ్రి కూడా ఐదేళ్ల క్రితం చెట్టుపై నుంచి పడి చనిపోవయాడు. ఐదేళ్లుగా తల్లి అమ్ములు, కొడుకు శ్రీకాంత్ కలిసి ఉంటున్నారు. ఇప్పుడు అమ్ములకు ఉన్న ఒక్కగానొక్క తోడు, తన కుమారుడు శ్రీకాంత్ కూడా ఈ విధంగా ప్రమాదం భారినపడి చనిపోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story