దిగుబడి సరిగ్గా లేక అప్పులు తీర్చే మార్గం లేక గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బానోత్ హచ్య.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పానుగోడు గ్రామానికి చెందిన గిరిజన రైతు బానోత్ హచ్య (50) తనకున్న రెండెకరాల పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. దిగుబడి సరిగ్గా లేక అప్పులు తీర్చే మార్గం లేక గ్రామంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బానోత్ హచ్య. జనగామ జిల్లా జఫర్ గడ్ గ్రామానికి చెందిన కాల్వ రాజు (36) అనే రైతు పెట్టుబడి కోసం తన భార్య నగలు తాకట్టు పెట్టి దాదాపు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా లేక అప్పులు కట్టలేని మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన గుజ్జుల సంపత్ రెడ్డి (34) అనే రైతు తనకున్న ఎకరంన్నర భూమితో పాటు మరొక 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, అప్పులు కట్టలేననే బాధతో విషగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వాటోలి గ్రామానికి చెందిన రైతు జాదవ్ వినోద్ (39), తనకున్న ఏడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు.ఆశించిన దిగుబడి రాక, పెట్టుబడికి తెచ్చిన అప్పు రూ.15 లక్షల అప్పు తీర్చలేనని మనస్తాపంతో తన ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
