✕
Free Power: Free electricity for Indiramma's homes..!

x
కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి కూడా ఉచిత కరెంట్ అందిస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించొచ్చని వెల్లడించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం పథకం వర్తించదని ఆయన ప్రకటించారు. ఫ్రీ కరెంట్ ద్వారా రాష్ట్రంలో 50%పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. కొత్తగా రేషన్ కార్డులు తీసుకొని పథకానికి దరఖాస్తు చేసుకోని వారుంటే దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

ehatv
Next Story

