ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court) సంచలన తీర్పు వెలువరించింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్(Ap), కర్ణాటక(karnataka) సరిహద్దులోని అనంతపురం జిల్లాలో జరిగిన అక్రమ ఇనుప గనుల తవ్వకాలకు సంబంధించినది. 13 ఏళ్ల విచారణ తర్వాత వచ్చిన ఈ తీర్పులో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy)కి ఏడేళ్ల జైలు శిక్ష విధించగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(Obulapuram Mining Case) ద్వారా 2006-2010 మధ్య ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో అక్రమ ఇనుప గనుల తవ్వకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ (CBI)2009లో కేసు నమోదు చేసి, 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. లీజు కేటాయింపుల్లో అవినీతి, అక్రమ తవ్వకాల ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో 219 మంది సాక్షుల విచారణ, 3337 డాక్యుమెంట్ల పరిశీలన జరిగింది. దోషులుగా బీవీ శ్రీనివాసరెడ్డి (A1): OMC మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి (A2): మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించారు. వీడీ రాజగోపాల్ (A3): అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నాడు. కె. మెఫజ్ అలీఖాన్ (A7) గాలి జనార్దన్‌రెడ్డడి పీఏ. నిర్దోషులుగా అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra reddy) తేలారు. ఆమెపై ఆధారాలు లేకపోవడంతో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారి బి. కృపానందం కూడా నిర్దోషిగా తేలారు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి(Srilaxmi)ని 2022లో హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. 2011లో అరెస్టైన గాలి జనార్దన్‌రెడ్డి 3 ఏళ్లకు పైగా హైదరాబాద్(Hyderabad), బెంగళూరు జైళ్లలో ఉన్నారు. 2015లో షరతులతో కూడిన బెయిల్ పొందారు.



ehatv

ehatv

Next Story