నార్సింగ్ మున్సిపాలిటీల్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా బండారం బయట పెట్టిన పోలీసులు.

నార్సింగ్ మున్సిపాలిటీల్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా బండారం బయట పెట్టిన పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22,906 ఫేక్ సర్టిఫికెట్లను రద్దు చేసిన జీహెచ్ఎంసీ(GHMC). వీటిలో బర్త్ సర్టిఫికెట్లు(birth certificates) 21,001, డెత్ సర్టిఫికెట్లు(Death certificates) 1,906. మెహిదీపట్నం(Mehdipatnam)లో అత్యధికంగా 5,403 బర్త్ సర్టిఫికెట్లు ఉండగా, తర్వాత చార్మినార్ (Charminar)3,256, బేగంపేట్ (Begumpet)2,123, సికింద్రాబాద్ (Secunderabad)1,511, ఫలక్ నుమా(Falaknuma) సర్కిల్ పరిధిలో 1,383 ఫేక్ సర్టిఫికెట్లు ( Fake Certificates)ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డెత్ సర్టిఫికెట్లు అత్యధికంగా బేగంపేట్ సర్కిల్ పరిధిలో 251 ఉండగా.. తర్వాత మెహిదీపట్నం సర్కిల్లో 186 ఉన్నాయని గుర్తించిన అధికారులు. ఫేక్ సర్టిఫికెట్లు జారీచేయడానికి కారణమైన హెల్త్ అసిస్టెంట్లు, కంపూటర్ ఆపరేటర్లు, మెడికల్ ఆఫీసర్ల పై చర్యలు తీసుకున్న అధికారులు.

Updated On
ehatv

ehatv

Next Story