గ్రూప్‌-1 పరీక్షను(Group-1 Exam) వాయిదా(Postpone) వేయాలంటూ దాఖలైన పిటిషన్లను(Petetion) హైకోర్టు(High court) కొట్టివేసింది.

గ్రూప్‌-1 పరీక్షను(Group-1 Exam) వాయిదా(Postpone) వేయాలంటూ దాఖలైన పిటిషన్లను(Petetion) హైకోర్టు(High court) కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌(Single bench) తీర్పును ద్విసభ్య బెంచ్ సమర్థించింది. ఈనెల 21 నుంచి యథావిధిగా పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలు రెండు సార్లు రద్దయ్యాయి. కొందరి కోసం వేల మంది అభ్యర్థులు ఎందుకు బాధపడాలని కోర్టు ప్రశ్నించింది. చివరి సమయంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈనెల 21 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో(Supreme court) కూడా పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని గ్రూప్-1 అభ్యర్థులు అశోక్‌నగర్‌(Ashok nagar) చౌరస్తా వద్ద ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో గ్రూప్-1 అభ్యర్థులను పోలీసులు చెదరగొట్టారు. పలువురు అభ్యర్థులపై పోలీసులు కూడా లాఠీచార్జీ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story