పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.15 లక్షలు తీసుకొని యువతిని జిమ్ ట్రైనర్ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.15 లక్షలు తీసుకొని యువతిని జిమ్ ట్రైనర్ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక యువతి 2019 లో హైదరాబాద్ కు వచ్చి, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్‌(Junior Artist)గా పని చేస్తుండగా, 2020 గాయత్రి హిల్స్‌(Gayatri Hills)లో ఉంటున్న జిమ్ ట్రైనర్(GYM Trainer) పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి సహజీవనం ప్రారంభించగా, కొన్ని రోజుల తర్వాత యువతిని దూరం పెట్టడం ప్రారంభించిన జిమ్ ట్రైనర్. దీంతో అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గ్రహించి, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తన సొంత గ్రామానికి యువతి వెళ్లిపోయింది. 2023 నవంబర్‌లో తిరిగి హైదరాబాద్(Hyderabad)కు వచ్చిన యువతికి, పెళ్లిచేసుకుంటాని చెప్పి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నం చేసిన జిమ్ ట్రైనర్ పెళ్లికి రూ.15 లక్షలు అవసరం అవుతాయని చెప్పడంతో, అతను అడిగిన డబ్బంతా చెల్లించిన యువతి. డబ్బులు తీసుకున్న కొన్ని రోజులకు యువతిని మళ్లీ దూరం పెట్టడం ప్రారంభించిన జిమ్ ట్రైనర్. దీంతో అతని గురించి ఎంక్వైరీ చేయగా, అతనికి ఇంతకముందే వివాహం జరిగిందని తెలుసుకొని, మోసపోయానని గ్రహించిన యువతి. తీసుకున్న డబ్బులు ఇవ్వమంటే తప్పించుకొని తిరుగుతుండడంతో, జిమ్ ట్రైనర్ పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి. బాధితురాలు ఫిర్యాదు మేరకు జిమ్ ట్రైనర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story