బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు(BJP MLA Palvai Harish Babu ) అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేవారు.

బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు(BJP MLA Palvai Harish Babu) అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేవారు. ఉత్తర తెలంగాణకు(Telangana) తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మా నోటికాడి ముద్ద లాక్కుంటున్నారన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు, పనుల మీద ఉన్న దృష్టి ఉత్తర తెలంగాణపై చూపడం లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)ప్రాజెక్టులపై చిన్న చూపుచూస్తున్నారన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు(Tummidihatti Project)ను చేపట్టకుండా ఆదిలాబాద్‌ను ఎండబెడుతున్నారన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద నీళ్లు లేవనడం తప్పు అని, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలమంతా కలిసి కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మా ప్రాజెక్టులపై చిన్నచూపు, అభివృద్ధిపై దృష్టి పెట్టలేని పక్షంలో మా ప్రాంతాన్ని మహారాష్ట్రలో(Maharasta) కలపాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story