Illicit affair..: అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాడు..! అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య..!

భార్య అందంగా ఉందని ఆశ పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. అన్యోన్యంగా గడిపారు. ఈ మధ్యనే పిల్లలకు ఫంక్షన్‌ కూడా చేశారు. కానీ ఆమెకు ఏం బుద్ధి పుట్టిందో ఏమో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో జాల్సాలు, రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని భర్తను ఉరి వేసి మరీ చంపింది. వివరాల్లోకి వెళ్తే..!

ప్రియుడి కోసం భర్తను భార్య చంపిన ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఈనాడు సోసైటీలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం, తాను చేసే అడ్డమైన జల్సాలకు అడ్డుగా ఉన్నాడని భర్తను చున్నీతో ఉరివేసి హత్య చేసిన భార్య. స్థానికంగా నివాసం ఉంటున్న సుధీర్ రెడ్డి భార్య ప్రసన్నకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన బంధానికి అడ్డుగా ఉన్నాడని.. చున్నీతో ఉరేసి హత్య చేసిన భార్య ప్రసన్న

ఆపై ఏమీ తెలియనట్లు అమాయకంగా ప్రసన్న నటించింది. సుధీర్‌రెడ్డి అక్క ఫిర్యాదు చేయగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. భార్యపై అనుమానం రావడంతో తమదైనా శైలిలో విచారించగా ప్రసన్న తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్య చేశానని ప్రసన్న అంగీకారం. అయితే తన హత్యకు వారం ముందే తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుధీర్‌రెడ్డి. ఆయన ఫిర్యాదు చేసిన సరిగ్గా వారం రోజులకే ప్లాన్ చేసి భర్తను భార్య చున్నీతో ఉరేసి చంపింది. దీంతో భార్యను అరెస్ట్ చేసి సంగారెడ్డి జిల్లా కంది పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated On
ehatv

ehatv

Next Story