తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్‌ జిల్లా బాసరలో జరిగింది.

తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్‌ జిల్లా బాసరలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి చిన్నప్పుడే దూరమవడంతో తండ్రే లోకంగా పెరిగాడు నితిన్‌. తండ్రి నాగారావు అమ్మలా గోరుముద్దలు తినిపించాడు. స్నేహితుడిలా కలిసి మెలిసి ఉండేవారు. ప్రతి విషయాన్ని పంచుకునేవారు. అలాంటి తండ్రి 3 రోజుల క్రితం మృతిచెందడంతో తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియల తర్వాత ఒంటరి వాడయ్యాడు. ఇంటి నిండా నిశ్శబ్దం అతడిని మరింత కుంగదీసింది. నాన్న లేని లోకంలో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్‌ జిల్లా బాసరలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

Updated On
ehatv

ehatv

Next Story