తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజలు ఛీకొడుతున్నారు. సమంతపై ఆమె మాటలు రోత పుట్టిస్తున్నాయి. సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే చాలా మంది విమర్శించారు. సినీ హీరో నాగార్జున(Nagarjuna) రియాక్టయ్యారు. 'గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను' అంటూ నాగార్జున ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story