హైదరాబాద్ మంగళ్‌హాట్ (ManghalHat) పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త మరణాన్నితట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ధూల్‌పేట ఆరంఘర్‌కాలనీలో ఉంటున్న భార్యాభర్తలు..బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో భర్త మరణించాడు.. ఇది తట్టుకోలేని భార్య తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మంగళ్‌హాట్ ఎస్‌ఐ.సాయికృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

wife suicide-compressed

రహింపురాకు చెందిన అమన్‌కుమార్ సింగ్ (Amankumar Sing), ఆరంఘర్ కాలనీకి చెందిన అస్మితసింగ్ (Asmitha Sing) ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. అమన్‌కుమార్ సింగ్ డిసెంబర్ 26న బ్రెయిన్ స్ట్రోక్‌తో (Brain Stroke) మృతి చెందాడు. ఆ తర్వాత అస్మిత మనస్తాపానికి గురైంది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ నెల 9న మధ్యాహ్నం గదిలో ఉన్నఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు అస్మితసింగ్‌ను కిందకు దించి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.