వారిద్దరికీ రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైంది. పరిచయం నుంచి ప్రేమ వికసించింది. దీంతో ప్రేమించి పెళ్లి జంట పెళ్లి చేసుకున్నారు.

వారిద్దరికీ రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైంది. పరిచయం నుంచి ప్రేమ వికసించింది. దీంతో ప్రేమించి పెళ్లి జంట పెళ్లి చేసుకున్నారు. అయితే అనుమానంతో భార్యను హత్య చేసి పెట్రోల్ పోసి భర్త తగలబెట్టాడు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకి రాంగ్ నెంబర్ ద్వారా పరిచయమైన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్‌కు చెందిన శ్రావణి (27) ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడి 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. పెళ్లయిన కొంతకాలానికే భర్త, పిల్లలను వదిలేసి తన అక్క భర్తతో వెళ్లిపోయిన శ్రావణి.. ఏడాది క్రితం మళ్ళీ తిరిగి రాగా ఆమెను భార్యగా అంగీకరించిన శ్రీశైలం. శ్రావణి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయడం గమనించి తరచూ శ్రీశైలం గొడవపడేవాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో ఆమెను హత్య చేయాలని పథకం వేసిన భర్త. సోమశిలకు వెళదామని భార్యను బైక్‌పై తీసుకెళ్లి.. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ సమీపంలో సీతాఫలం పండ్లు ఉంటాయని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసిన భర్త. తొలుత చున్నీని ఆమె మెడకు చుట్టి గొంతు నులిమి, తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచి చంపి, వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడి నుంచి పరారైన శ్రీశైలం.తన కూతురు కనిపించట్లేదని శ్రావణి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా.. అంతలోనే పోలీసుల ఎదుట లొంగిపోయిన భర్త శ్రీశైలం

Updated On 25 Aug 2025 6:27 AM GMT
ehatv

ehatv

Next Story