హైద‌రాబాద్ చైత‌న్య‌పురి ఠాణా ప‌రిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ కోసం జ‌రిగిన గొడ‌వలో ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైద‌రాబాద్ చైత‌న్య‌పురి ఠాణా ప‌రిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ కోసం జ‌రిగిన గొడ‌వలో ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త‌పేట వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 21న ఘటన జరిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. గండ్ర నాగిరెడ్డి(Gandra Nagi Reddy) కుటుంబంతో క‌లిసి 13 ఏళ్లుగా కొత్త‌పేట వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌(Vaishnavi Ruthika Apartment)లో నివాసం ఉంటున్నారు.. అదే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబ‌ర్-402లో అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజి వ‌చ్చారు. ఆయ‌న త‌న కారును అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేశాడు.. గండ్ర నాగిరెడ్డి బ‌య‌ట నుంచి వ‌చ్చి త‌న కారును కృష్ణ(Krishna) కారు వెనక నిలిపాడు. అయితే కృష్ణ జివ్వాజి తిరిగి వెళ్లేందుకు కిందికి రాగా... త‌న కారుపై గీత‌లు క‌నిపించాయి. దీంతో అందుకు నాగిరెడ్డి కార‌ణ‌మ‌ని, వాచ్‌మెన్‌తో అత‌డిని కిందికి ర‌ప్పించి కృష్ణ జివ్వాజి దాడి చేశాడు. దీంతో నాగిరెడ్డి చెవిలోంచి ర‌క్తం, నోటిలోంచి నురుగ వ‌చ్చి ప‌డిపోవ‌డంతో ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు. కానీ, అప్ప‌టికే అత‌డు మృతిచెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story