హైదరాబాద్ సిటీ పోలీసులు కీలకమైన అలర్ట్ ఇవ్వడమే కాదు.. హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా టపాసులు కాల్చడంపై నిషేధం విధించారు.

హైదరాబాద్ సిటీ పోలీసులు కీలకమైన అలర్ట్ ఇవ్వడమే కాదు.. హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా టపాసులు కాల్చడంపై నిషేధం విధించారు. పెళ్లయినా.. పేరంటం అయినా.. షాపు ఓపెనింగ్ అయినా.. ఇంకే సందర్భం అయినా సరే టపాసులు కాల్చటంపై బ్యాన్ విధించారు. అంతే కాదు.. టపాసుల(Firecracker) అమ్మకాలపైనా ఈ నిషేధం ఉంటుంది. టపాసులు అమ్మే వ్యాపారులకు వార్నింగ్స్ ఇచ్చారు. టపాసులు కాల్చొద్దని హైదరాబాద్ (Hyderabad)సిటీ జనానికి స్పష్టంగా చెప్పారు పోలీసులు. పొరపాటున కూడా టపాసులు కాల్చొద్దని.. ఒక వేళ కాల్చితే జైలుకు పంపిస్తామని గట్టిగా చెప్పారు.

హైదరాబాద్ సిటీలో టపాసులు కాల్చటంపై నిషేధం వెనక కారణాలు లేకపోలేదు. ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శాంతిభద్రతలు, భద్రత విషయంలో ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇండియా టార్గెట్ గా పాకిస్తాన్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఇలాంటి సమయంలో టపాసులు కాల్చినట్లయితే.. ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం, ప్రమాదం ఉంది. ఏది బాంబు.. ఏది టపాసు అనే విషయంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది.

అది ప్రత్యర్థులు వదిలిన బాంబుల లేక టపాసుల సౌండా అనే విషయంలో ప్రజలు, అధికారులు గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లోనే కాకుండా.. సున్నితమైన ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్న నగరాల్లో టపాసుల అమ్మకాలు, కాల్చటంపై నిషేధం విధించింది ప్రభుత్వం.

హైదరాబాద్ సిటీవాసుల్లారా జాగ్రత్త.. బీ కేర్ ఫుల్. పెళ్లిళ్లు.. వేడుకలు, ఫంక్షన్స్ అంటూ టపాసులు కాల్చారా.. మీరు జైలుకు వెళ్లటం ఖాయం. పొరపాటున కాల్చాం.. మాకు తెలియదు అన్నా పోలీసులు వినే పరిస్థితి ఉండదు.. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. చర్యలు కఠినంగా.. చాలా సీరియస్ గా ఉంటాయి.

ehatv

ehatv

Next Story