ఏపీ మాజీ సీఎం జగన్(YS Jagan) ఇంటికి హైడ్రా నోటీసులు(Hydra Notices) అంటూ వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) వివరణ ఇచ్చారు.

ఏపీ మాజీ సీఎం జగన్(YS Jagan) ఇంటికి హైడ్రా నోటీసులు(Hydra Notices) అంటూ వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. హైద్రాబాద్ లోని జగన్ లోటస్ పాండ్ FTL పరిధిలోనే ఉందని. త్వరలోనే హైడ్రా లోటస్ పాండ్ కూల్చేస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చినట్లు వస్తోన్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. జగన్ హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని దానిని ఎవరూ నమ్మొదని సూచించారు. హైడ్రా ఇలాంటి నోటీసులు ఇవ్వదని అక్రమం అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తుంది అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story